*జనసేన సీరియస్
బెళుగుప్ప మండల కేంద్రంలోని బెళుగుప్ప-1 సచివాలయానికి చెందిన డిజిటల్ అసిస్టెంట్ ఉపేంద్ర, ఎన్టీఆర్ భరోసా పింఛన్లను 61 మంది లబ్ధిదారులకు పంచాల్సి ఉండగా కేవలం ముగ్గురికి మాత్రమే పెన్షన్లు అందించి మిగిలిన రూ.2,58,000ను దుర్వినియోగం చేసి పరార్ అయిన ఘటనపై జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కాశంశెట్టి సుధీర్ తీవ్రంగా స్పందించారు. మొత్తం రూ.2,76,000 పెన్షన్ డబ్బులలో అత్యధిక భాగాన్ని అనుమానాస్పదంగా తీసుకొని పరారైన ఉపేంద్రపై ఎంపీడీవో లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు అయినట్లు తెలిపారు. ఉపేంద్ర నిజంగా తన వ్యక్తిగత సమస్యల వల్ల ఇలాంటి చర్యకు పాల్పడ్డాడా? లేక ఇరుగు పొరుగులపై దృష్టి పెట్టిన నలుగురి మాదిరి ఇది కావాలనే ఉద్దేశ్యంతో జరిగిందా అన్నది స్పష్టత అవసరమని పేర్కొన్నారు. ఇలాంటి దుశ్చర్యలను కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సహించదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సుదీర్ హెచ్చరించారు.
Share this content:
Post Comment