ఉత్తమ సేవా పురస్కారం అందుకొన్న మోటూరి దంపతులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నందు ఉగాది సందర్భంగా పంచాంగం కార్యక్రమంలో భాగంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎన్నో వేలది మందికి అన్నం పెడుతున్న సంవత్సరం పొడుగునా నిత్యం ప్రతిరోజు సేవా కార్యక్రమాలు చేస్తున్న చిందాడగరువు ఎం.పి.టి.సి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులకు కలెక్టర్ చేతుల మీదుగా సాలువ కప్పి ఘనంగా సత్కరించి జిల్లా ఉత్తమ సేవా అవార్డును అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులందరూ పాల్గొన్నారు.