ఏలూరు జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి రోజురోజుకు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుంది. ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏలూరు నగరంలోని 3, 35వ డివిజన్ లకు చెందిన వైసిపి, ఇతర పార్టీలకు చెందిన 50 మందికి పైగా ఆదివారం జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ ఏలూరు నియోజవర్గం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి రెడ్డి అప్పలనాయుడు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం, యువతీ యువకుల భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధికి అరాచక ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ నిర్విరామంగా పోరాడుతున్నారని చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మంచి పాలన జరగాలని ఆశయాలు, సిద్ధాంతాలు, నిబద్దతతో పోరాడుతున్న పవన్ కళ్యాణ్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన జరుగుతుందని, ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని, ఈ పాలన అంతం చేయాలంటే ప్రజలందరూ ఏకం కావాలని సూచించారు. సైకో ప్రభుత్వం అంతానికి సాగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. 20 24 ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసే జనసేన, టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు బివి రాఘవయ్య చౌదరి, ఏలూరు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.