వడ్రాణం హరిబాబుకు శుభాకాంక్షలు

*శుభాకాంక్షలు తెలిపిన వేమూరు జనసేన నాయకులు

గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన వడ్రాణం హరిబాబు నాయుడుకు శనివారం వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు సోమరౌతు అనురాధ, సోమరౌతు బ్రహ్మం మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పాలనలో కోఆపరేటివ్ సొసైటీలు బలోపేతం చెంది రైతులకు అన్ని విధాలా మద్దతు అందించేందుకు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలోని ఇతర మార్కెటింగ్ సొసైటీల్లో కూడా కమిటీలను త్వరితగతిన నియమించాలి. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు మరియు రుణాల వంటి సేవలు సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వేమూరు నియోజకవర్గ నేతలు పాలపాటి రాకేష్, తాడికొండ కోటేశ్వరరావు, తాడికొండ మురళి, అమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment