కంగనా, హృతిక్‌ ల మధ్య మళ్ళీ మొదలైన…!

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ … ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. రైతుల ఉద్యమం, అంతకుముందు సుశాంత్‌సింగ్‌ ఆత్మహత్య కేసుకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాలు కొని తెచ్చుకుంది. తాజాగా.. బాలీవుడ్‌ నటుడు హృతిక్‌రోషన్‌పై విరుచుకుపడింది. చిన్న వ్యవహారాన్ని గుర్తు పెట్టుకొని ఇంకా ఎన్నిరోజులు ఏడుస్తావ్‌..? అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరింది. అయితే క్రిష్ 3 సినిమా తర్వాత వీరి మధ్య ఘాటు ప్రేమాయణం నడిచిందని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపించింది. వీరిది గొప్ప ప్రేమ జంటని, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని, స్వీట్ లవర్స్ అని ఇలా ఎన్నో ప్రచారాలు జరిగాయి. కొంత కాలం తర్వాత వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడి బ్రేకప్ అయినట్లు వార్తలు వచ్చాయి.

ఆ క్రమంలో కంగనా రనౌత్ హీరో హృతిక్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అలా ఈ ప్రేమ వ్యవహారం లో ఇరువురి మధ్య “మెయిల్” రచ్చ మొదలైంది. కంగనా తో తనకు ఎటువంటి సంబంధం లేదని.. అయినా ఆమె జిమెయిల్ అకౌంట్ నుండి వందలకొద్దీ మెయిల్స్ వస్తున్నాయని… దీని కారణంగా తన ఇమేజ్ దెబ్బతింటుందని 2016లో పోలీసులకు ఫిర్యాదు చేశారు హృతిక్. అయితే ఆ కేసుపై ఎటువంటి పురోగతి లేదని, ఇప్పటికైనా దానిపై దృష్టి సారించాలంటూ హృతిక్‌ తరఫు లాయర్‌ మహేష్‌ జెఠ్మలానీ ముంబై పోలీసులకు తాజాగా లేఖ రాశారు. విషయాన్ని తెలుసుకున్న కంగనా రనౌత్ స్పందిస్తూ తన మాజీ ప్రియుడు హృతిక్ రోషన్ పై మండిపడ్డారు.

అతడి ఏడుపుగొట్టు కథ మళ్లీ మొదటికొచ్చింది. అతనితో బ్రేకప్‌ అయ్యి, అతని ప్రేమకు విడాకులు తీసుకుని చాలా ఏళ్లు అవుతోంది. అయినా జరిగిన దాన్ని మరచి అతడి ముందుకు సాగడం లేదు. వేరే మహిళతో డేటింగ్‌ చేయడానికి ఇష్టపడటం లేదు. నా వ్యక్తిగత నా జీవితంలో ఎదురైన సమస్యలను అధిగమించి ధైర్యంగా నేను ముందుకు సాగుతుంటే హృతిక్ మళ్లీ అదే డ్రామా రిపీట్ చేస్తున్నాడు. ఈ చిన్నపాటి ఎఫైర్‌ గురించి ఇంకా ఎంత కాలం టైం వేస్ట్ చేసుకుంటావు హృతిక్ ‘అంటూ కంగనా హృతిక్‌ రోషన్‌పై విమర్శలు విసిరారు.