భగత్ సింగ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘననివాళి

మన భారత రాజ్యాంగం సృష్టికర్త అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా గురువారం యస్ కే యూనివర్సిటీ భగత్ సింగ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో యస్ కే యూనివర్సిటీ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి ఘనంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భగత్ సింగ్ విద్యార్థి విభాగం జిల్లా నాయకులు గాండ్ల జయంత్ వర్ధన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాకిరణం భారత రాజ్యాంగ నిర్మాణ కర్త డా. బీఆర్ అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, అణగారిన వర్గాలకు బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని తెలియజేశారు. అంబేద్కర్ అంటరానితనం తార స్థాయిలో వున్న కాలంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ప్పటికి పట్టుదలతో ముందుకు సాగి చదువును అభ్యసించి భారతదేశంలో అతున్యత వ్యక్తులలో ఒకరిగా ఎదిగారు అని తెలియజేశారు. భారత రాజ్యాంగ రూపశిల్పి భారతకేంద్ర మొదటి న్యాయశాఖ మంత్రి డా.బీఆర్ అంబేద్కర్ ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యస్ కే యూనివర్సిటీ నాయకులు విష్ణు, వంశీ, సుబ్బారాయుడు, వినయ్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.