23 ఏళ్ల వయసులోనే ఊరి కొయ్యను ముద్దాడిన వీరుడు భగత్ సింగ్: ప్రేమకుమార్

కూకట్‌పల్లి ఆదివారం భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కెపిహెచ్బి కాలనీ 5వ ఫేస్ జనసేన పార్టీ ఆఫీసు నందు కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ భగత్ సింగ్ పటమునకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రేమకుమార్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేశారని హుస్సేన్ వాలా జైల్లో 23 ఏళ్లు గల భగత్ సింగ్ ని, సుఖదేవ్ ,రాజ్ గురువులను ఇదే రోజున రాత్రి 7:30 గంటలకు ఉరితీసారని, వారు భారతదేశం కోసం ప్రాణం త్యాగం చేసిన యువకులని, బ్రిటిష్ పాలకులు మనుషులను చంపగలిగారు కానీ వారి ఆదర్శాలు కాదని అన్నారు. ప్రస్తుతం యువత చెడు వ్యసనాలు అలవాటు చేసుకోకుండా దేశభక్తితో ఉండాలని, భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శ దేశంగా ఉండాలంటే యువతే దేశానికి వెన్నుముకై నిలవాలని మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా కోరుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి జనసేన నాయకులు వేముల మహేష్, కొల్లా శంకర్, కలిగినీడీ ప్రసాద్, విశ్వేశ్వరరావు, సూర్య, క్రాంతి శేఖర్, కొల్లా హనుమంతరావు, నాగేశ్వరరావు, చిన్నం దేవ సహాయం, పులగం సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment