భగత్‌సింగ్‌ త్యాగం చిరస్మరణీయం

స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్ జయంతిని పురస్కరించుకొని తన తరఫున, జనసైనికుల తరఫున జనసేనాని భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన త్యాగాలను గుర్తుచేసుకున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను తృణప్రాయంగా ఇచ్చిన గొప్ప పోరాట యోధుడు భగత్‌సింగ్‌ అని వారు కొనియాడారు. పోరాటాలతోనే హక్కులు సాధ్యమని, నేటి యువత భగత్‌సింగ్‌ మార్గంలో నడవాలని జనసేనాని పిలుపునిచ్చారు. భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని జనసేనాని ఒక లేఖను విడుదల చేశారు.

చైతన్య దీప్తి భగత్‌సింగ్‌. వీరులకు మరణం లేదు అనే మాట భారతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ తోనే మొదలైనదా అనిపిస్తుంది. ఆయన అమరుడై తొమ్మిది దశాబ్దాల అవుతున్నా భారతీయ యువత గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. సెప్టెంబర్ 28 ఆయన జయంతి ఆ విప్లవ మూర్తి ఈ అవనిపై నా చైతన్య దీప్తిగా ఉద్భవించిన రోజు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ విప్లవ దేశానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలo? మనస్ఫూర్తిగా ఆయనకు వందనాలు సమర్పించి జేజేలు పలకడం తప్ప. నూనూగు మీసాల వయసులోనే ఉరి కంబాన్ని ముద్దాడిన అమరజీవి భగత్ సింగ్.. తన మరణం లక్షలాది మంది వీరులు ఉద్బవించడానికి ఒక కారణం అవుతుందని చెప్పిన ఆయన మాటలు అనతికాలంలోనే నిజమయ్యాయి. ఆయన స్ఫూర్తితోనే లక్షలాది మంది యువకులు స్వాతంత్ర సంగ్రామంలో ముందుండి పోరాటం చేశారు అంటూ జనసేనాని లేఖ లో పేర్కొన్నారు.