వెంకటలక్ష్మికి భారత సేవా రత్న పురస్కారం

  • దేశవ్యాప్తంగా 130 మంది సేవకులకు
  • భారత సేవా రత్న పురస్కారాలు

గాజువాక: మూడు దశాబ్దాలుగా ఎంతోమందికి రక్తం అందించి తాసుబెల్లి ఫౌండేషన్ సంస్థ ప్రాణదాతలుగా నిలిచిందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ కొనియాడారు, ఆదివారం ఇక్కడ ఆంద్రప్రదేశ్, విశాఖపట్నం, అక్కయ్యపాలెం రైతు బజార్ వద్ద సాయి బాలాజి ఫంక్షన్ హోల్ లో వివిధ రాష్ట్రాల్లో రక్తదానము తో పాటు వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న 130 మంది సమాజ సేవకులకు భారత సేవా రత్న పురస్కారాలను తాసుబెల్లి ఫౌండేషన్ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో తమ్మిరెడ్డి శివ శంకర్ పాల్గొని మాట్లాడుతూ, సౌబిండి వెంకటలక్ష్మి చేసిన సేవలు గుర్తించి భారత సేవా రత్న పురస్కారం తో మేమంతా ఆమెను సత్కరించటం అభినందనీయమని అన్నారు, అలాగే దేశవ్యాప్తంగా తాసుబెల్లి ఫౌండేషన్ వినూత్న రీతిలో సేవలు అందిస్తుందన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ రక్తదాన శిబిరాలు నిర్వహించి అవసరమైన ప్రతీ ఒక్కరికి కూడా రక్తం అందజేయడం ఎంతో ప్రశంసనీయమన్నారు.. ఇటువంటి సంస్థ కార్యక్రమాల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. మాజీ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, తెదేపా నాయకుడు ఆడారి కిషోర్ కుమార్ లు పాల్గొని మాట్లాడుతూ తాసు బెల్లి ఫౌండేషన్ సేవలు స్ఫూర్తిదాయకం అన్నారు. సంస్థ గౌరవ అధ్యక్షులు, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు చెందిన సమాజ సేవకులను, రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎంతోమంది 100 సార్లకు పైగా రక్తదానం చేసిన వారున్నారన్నారు. సంస్థ చైర్మన్ శంకర్ నాయుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 130 మంది సేవకులను భారత సేవా రత్న పురస్కారాలతో సత్కరించుకోగలిగామన్నారు. రక్తదానం తో పాటు వీరు అనేక రూపాల్లో తమ వినూత్న సేవలు అందిస్తున్నారన్నారు. ఫౌండేషన్ ట్రస్టీలు ఎర్రము శెట్టి సురేష్, ఎస్. వెంకటలక్ష్మి, అఖిల్ నాయుడు, నవీన్ పెద్దమల్ల, కరణం కళావతి తో పాటు డాక్టర్ వర్మ పలువురు పాల్గొన్నారు.