పవన్ కోసం ‘భవదీయుడు .. భగత్ సింగ్’ టైటిల్ ఖరారు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . ఈ కాంబోలో సినిమా రావలని అభిమానులు ఎంతగానో ఆశించారు. అది ఇప్పుడు నెరవేరబోతుంది.త్వరలో పవన్‌- హరీష్ శంకర్ మూవీ పట్టాలెక్కనుండగా తాజాగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలింది చిత్రబృందం. పవన్ కెరీర్‌లో తెరకెక్కుతున్న 28వ చిత్రానికి ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ కమిటయిన క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఇదీ ఒకటి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ వరుసగా ప్రాజెక్ట్స్‌ని లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘భవదీయుడు భగత్‌సింగ్’ రూపొందనుంది. తాజాగా విడుదల చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అప్పుడే భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. గతంలో పవర్ స్టార్ – హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా పవన్ ప్రస్తుతం నటిస్తున్న ‘భీంలా నాయక్’, ‘హరి హర వీరమల్లు’ చిత్రాలతో సెట్స్ మీదున్నాయి.