రామగుండం జనసేన ఆధ్వర్యంలో భోగి పండుగ సంబరాలు

రామగుండం నియోజకవర్గం: జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గోదావరిఖని చౌరస్తాలో నిర్వహించిన భోగి పండుగ సంబరాలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన అధ్యక్షులు రావుల మధు పాల్గొని రామగుండం నియోజకవర్గ ప్రజలకు, జనసేన నాయకులకు, వారి కుటుంబ సభ్యులకు మరియు పాత్రికేయులకు బోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నియోజకవర్గ ప్రజలు అందరు సంక్రాంతి పండుగా కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు రావుల సాయి కృష్ణ, మంథని శ్రవణ్, రంజిత్, రవికాంత్, మధు, కళ్యాణ్, లోకేష్, సంతోష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.