సీసీ కెమెరాలు ఏర్పాటు నిమిత్తం భోగిల శ్రీనివాస్ ఆర్థిక సహాయం

విశాఖ తూర్పు నియోజకవర్గం: జనసేన పార్టీ నాయకులు భోగిల శ్రీనివాస్ పట్నాయక్ గురువారం విశాఖ తూర్పు నియోజకవర్గం, 17వ వార్డులో ఇందిరానగర్ కాలనీలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా జాగ్రత్త తీసుకోవడం కోసం కాలనీలో 8 సీసీ కెమెరాలు ఏర్పాటు నిమిత్తం భోగిల శ్రీనివాస్ 20000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఇంకా అదనంగా సీసీ కెమెరాలు కొరకు అవసరమైన ఆర్థిక సహాయం కూడా అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు అందరూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.