ముంపు సమస్య పరిష్కారానికి భూమిపూజ

*అంతర్వేది పరిసరాల్లో ముంపు నీటిని సముద్రంలోకి లిఫ్ట్ చేసే పనులకు శ్రీకారం
*భూమి పూజ చేసిన రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్

రాజోలు, అంతర్వేదికర గ్రామం మరియు అంతర్వేది దేవస్థానం పరిసర ప్రాంతాల్లో ముంపు నీటి సమస్యకు పరిష్కారంగా, ముంపు నీటిని సముద్రంలోకి లిఫ్ట్ చేసే పనుల కోసం రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ బుధవారం భూమిపూజ నిర్వహించారు. ప్రజల అభ్యర్థన మేరకు ప్రారంభించిన ఈ పనులకు వరప్రసాద్ కొబ్బరికాయ కొట్టి శుభారంభం చేశారు. ఈ సందర్భంగా సెయింట్ మేరీస్ స్కూల్ విద్యార్థులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, వశిష్ట మరియు వైనతేయ గోదావరిలో బడిన ఈ మినీ డెల్టా ప్రాంతం మునుపు కళకళలాడితే, ప్రస్తుతం ముంపు నీటి వల్ల కోనసాగు పంటలు నాశనమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సముద్ర మట్టం పెరగడం, కాలువల జాలం దెబ్బతినడం, మానవ తప్పిదాల వల్ల జనావాసాల్లోకి నీరు చేరుతుందని పేర్కొన్నారు. లిఫ్ట్ సిస్టం ద్వారా ముంపునీటిని సముద్రంలోకి తరలించడం వల్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న స్లూయిజ్ల పునర్నిర్మాణం కూడా చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, దేవస్థాన అధికారులు, ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-06-18-at-6.41.50-PM-1024x461 ముంపు సమస్య పరిష్కారానికి భూమిపూజ

Share this content:

Post Comment