వరద బాధితులకు అండగా నిలిచిన భూపాలపల్లి మరియు మంథని జనసేన

మంథని, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు ఆదివారం మంథని నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి మాయ రమేష్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొరంచపల్లి గ్రామంలో జనసేన పార్టీ భూపాలపల్లి మరియు మంథని నియోజకవర్గ జనసేన మండల నాయకులు జనసైనికులతో కలిసి గ్రామంలో ఉన్న పరిస్థితులను చూసి పరిశీలించి కంటితుడుపు చర్యగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఏ సహాయక చర్యలు జరగడం లేదు అని గమనించి గ్రామస్థులకు ఈ ఒక పూటకు సరిపోయే విధంగా అన్నపానీయాలు సమకూర్చడం జరిగింది. ఈ చర్యకు గ్రామస్తులు చూపించిన ప్రేమ మరువలేను. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఈరోజు చేసిన చిన్న ప్రయత్నం మనస్సుకు ప్రశాంతతను కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాతోపాటు, భూపాల్ పల్లి జిల్లా నాయకులు జెర్రిపోతుల సనత్ కుమార్, కాల్వ రాజశేఖర్, ఘనపూర్ మండల నాయకుడు బీరెల్లి సుమన్, మంథని మండల అధ్యక్షులు ఇరవేనా ఓం ప్రకాష్ పైడిమల్ల రాజు, బూర్ల మల్లికార్జున్, సాయి, నారమళ్ళ శంకర్, బొడ్డు సుధాకర్, శేషోజ్వాల రాజేష్, జనగం పవన్, ఇసంపల్లి రాకేష్, ప్రణయ్ రెడ్డి, శివ ప్రసాద్, గణేష్, పైడిమల్ల అక్షయ్ కుమార్, పక్కల వినయ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.