మార్కాపురం జిల్లా సాధన కై సైకిల్ యాత్ర

మార్కాపురం పట్టణం స్థానిక ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంలో భాగంగా జిల్లా సాధన సమితి నాయకులు మార్కాపురం జిల్లా సాధన కోసం సైకిల్ యాత్ర చేయుటకు నిర్ణయించారు. ఈ సమావేశంలో జిల్లా సాధన సమితి వైస్ ఛైర్మన్ మరియు జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జి ఇమ్మడి కాశీనాధ్, జిల్లా సాధన సమితి ఛైర్మన్ కందుల నారాయణరెడ్డి, జిల్లా సాధన సమితి ట్రెజరర్ వక్కలగడ్డ మల్లికార్జున, జనసేనపార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, సీపీఐ పార్టీ నాయకులు అందే నాసరయ్య, కాసీం, సీపీఎం పార్టీ నాయకులు సోమయ్య, రఫీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు వేశపోగు సుదర్శన్ పాల్గొన్నారు.