రెల్లి కాలనీలో బిందెల పంపిణీ

పాయకరావుపేట నియోజకవర్గం, చిన దొడ్డిగల్లు గ్రామం రెల్లి కాలనీలో జనసేన టీడిపి బిజెపి కలయికలో వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ బిందెలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, వారాహి విజయయాత్ర వాలంటీర్స్ కోర్ కమిటీ సభ్యులు మరియు పాయకరావుపేట నియోజకవర్గ జనసేన నాయకులు శివదత్ బోడపాటి, జనసేన నాయకులు, జనసైనికులు, బిజెపి నాయకులు, తెలుగుదేశం నాయకులు మరియు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.