క్రీస్తుజననం.. క్రిస్మస్ వేడుక

డిసెంబర్ 25 అంటే క్రీస్తుజన్మదినం, క్రిస్మస్. ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవులు జరుపుకొనే పండగ క్రిస్మస్‌. కొత్త సంవత్సరానికి ముందు వచ్చే ఈ పండుగ కోసం ప్రపంచంలోని క్రైస్తవులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. క్రీస్తు జన్మదినం రోజును క్రిస్మస్ గా జరుపుకుంటారు. అర్ధరాత్రి నుంచి ఈ వేడుకలు ప్రారంభం అవుతాయి. క్రైస్తవులు చర్చీలకు వెళ్లి అర్ధరాత్రి నుంచి ప్రార్ధనలు చేస్తారు. శుభాకాంక్షలు చెప్పుకుంటారు.

క్రీస్తు ప్రపంచానికి ఇచ్చిన సందేశం గురించి, ప్రపంచం కోసం క్రీస్తు చేసిన మంచి పనుల గురించి తలచుకుంటారు. ఎవరి స్థోమతకు తగ్గట్టుగా వారు ఈ పండుగను జరుపుకోవడం విశేషం. ఈ వేడుకల కోసం దేశంలోని చర్చలు అందంగా ముస్తాబయ్యాయి. ప్రపంచంలో అత్యధిక మంది జరుపుకునే పండుగల్లో క్రిస్మస్ ఒకరి కావడం విశేషం. ఈ పండుగ రోజున క్రిస్మస్ ట్రీ, శాంతాక్లాస్ ప్రతిచోటా దర్శనం ఇస్తుంటాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అయితే, కరోనా కారణంగా క్రిస్మస్ వేడుకలు ఈ ఏడాది కళతప్పాయి. గతంలో మాదిరిగా హడావుడి లేకుండా సాదాసీదాగా క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నారు.