అంబరాన్నంటిన బత్తుల జన్మదిన సంబరాలు

రాజానగరం: పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, జనసేన జననేత బత్తుల బలరామకృష్ణ జన్మదిన మహోత్సవం సందర్భంగా శుక్రవారం రాజానగరం మండలం, తోకాడ గ్రామంలో బలరామకృష్ణ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా జనసైనికులు ఉత్సాహ భరితమైన కేరింతలతో, బాణసంచా కాల్చుతూ, భారీ కేక్ కటింగ్ కార్యక్రమంతో తోకాడ జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామపెద్దలు తమ ప్రియతమ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు.