అంబరాన్నంటిన బత్తుల వెంకటలక్ష్మి జన్మదిన వేడుకలు

రాజానగరం నియోజకవర్గ ప్రముఖ సంఘసేవకురాలు, జనసేన నాయకురాలు “నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్” శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి జన్మదిన సందర్భంగా ఆమె పుట్టినరోజు వేడుకలు కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు, జనసైనికుల అంబరాన్నంటేలా జరిగాయి. ఈ సందర్బంగా కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు రాజానగరం నియోజకవర్గం నలుమూలల నుండి జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి బత్తుల వెంకటలక్ష్మి కి శాలువాలు కప్పి పుష్ప గుచ్చాలు ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ సందర్బంగా బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గ ప్రజలు తమపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు ఎల్లప్పుడు రుణపడి ఉంటానని తెలియజేశారు. జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి జనసేన నాయకులకు, జనసైనికులకు, వీర మహిళలకు, నియోజకవర్గ ప్రజలకు పేరుపేరునా ధన్యవాదములు తెలియజేశారు.