మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య జన్మదిన వేడుకలు

అమలాపురం, కాపు సంక్షేమ సేన రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు బసవా చినబాబు ఆధ్వర్యంలో మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకులు చేగొండి హరిరామజోగయ్య 86వ జన్మదిన వేడుకలు ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకులు డిఎమ్ఆర్ శేఖర్ అతిధులుగా అయితాబత్తుల ఉమామహేశ్వరరావు విచ్చేశారు. కేక్ కటింగ్ అనంతరం, బడుగు బలహీన, దళిత వర్గాలకు చెందిన రైతులకు శాలువా కప్పి, నూతన వస్త్రాలు బహుకరించి సత్కరించారు. ఈ కార్యక్రమానికి సభాద్యక్షులుగా పోలిశెట్టి బాబులు వ్యవహరించగా జనసేన నాయకులు లింగోలు పండు, ఆర్డిఎస్ ప్రసాద్, పోతు కాశీ, రంకిరెడ్డి అబ్బులు, కొప్పుల నాగ మానస, తిక్కా సరస్వతి, వివిధ విభాగాల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.