- జనసైనికుల కోలాహలం నడుమ యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ జనసేన నాయకుల జన్మదిన వేడుకలు
- బైక్ ర్యాలీలతో వెల్లి తమ స్వగృహం నందు జన్మదిన వేడుకలు నిర్వహించిన జనసేన నాయకులు..
నంద్యాల: సోమవారం యంగ్ అండ్ డైనమిక్ జనసేన నాయకులు రాచమడుగు చందు, రాచ మడుగు సుందర్ ల జన్మదినం పురస్కరించుకొని జనసైనికులు, అభిమానులు, ఆత్మీయుల మధ్య సంబరాలు నిర్వహించారు. టపాసులు, జనసైనికుల జై జనసేనా అనే నినాదాల నడుమ గజమాలతో రాచమడుగు సుందర్ రాచమడుగు చందును శాలువాలతో ఘణంగా సన్మానించి జనసైనికులు ఏర్పాటుచేసిన భారీ కేకును రాచమడుగు సుందర్ రాచమడుగు చందు కట్ చేసి సంతోషాలను పంచుకున్నారు. ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు గురు మాట్లాడుతూ నీతి నిజాయితీలకు అద్దం పడుతూ జనసేనాదిపతి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలతో ముందుకు వెళుతూ.. సొంత నిధులతో ఎంతోమందికి సహాయ సహకారాలను అందిస్తూ పార్టీలో ఎలాంటి పదవులను ఆశించకుండా.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ముందుకు సాగుతున్న రాచమడుగు చందు, రాచమడుగు సుందర్లను అభినందిస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జనసేన నాయకులు రాచమడుగు సుందర్ మాట్లాడుతూ తమ ఇద్దరు సోదరులపై ఇంత అభిమానాన్ని చూపిస్తున్న జనసైనికులు, వీరనారిమణులకు కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేశారు. తమకు పార్టీలో ఎలాంటి పదవులు ఆశించడం కన్నా తమ పార్టీని బలోపేతం చేసుకుంటూ.. తమ నాయకుడు అడుగుజాడల్లో ముందుకు వెళుతూ.. పార్టీ సిద్ధాంతాలతో ముందుకు వెళ్తామంటూ తమపై ఇంత ప్రేమను అభిమానం చూపిస్తున్న ప్రతి ఒక్కరికి పార్టీ తరఫున అన్ని విధాలాగా అండగా ఉంటామంటూ జనసేన నాయకులు రాచమడుగు సుందర్, రాచ మడుగు చందు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, అభిమానులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment