కార్తికేయకు బర్త్ డే గిఫ్ట్..

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వర్థమాన హీరో కార్తికేయ. ఈ సందర్బంగా గీతా ఆర్ట్స్2 కార్తికేయకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది. కార్తికేయ హీరోగా అల్లు అరవింద్‌ సమర్పిస్తున్న సినిమా ‘చావు కబురు చల్లగా’ గ్లింప్స్ విడుదల చేసింది. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తోన్న ఈ సినిమాకి కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కార్తికేయ బస్తీ బాలరాజుగా నటిస్తున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్. తాజాగా రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించి, శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసే దిశగా ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత బన్నీ వాసు తెలిపారు. పుట్టినరోజు సందర్బంగా అభిమానులతో పాటూ సినీ ప్రముఖులు కార్తికేయకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.