ఉప ఎన్నికల బరిలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధి

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి ఉమ్మడి అభ్యర్ధి బరిలోకి దించుతామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధానంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధిపై ఫోకస్ చేశామని వెల్లడించారు. తిరుపతి ఉప ఎన్నిక బీజేపీకి కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.