పాతబస్తీలో పట్టుకోసం ప్రయత్నిస్తున్న బీజేపీ?

తెలంగాణలో అన్ని ప్రాంతాలలో విస్తరించడానికి ప్రణాళికలు రచిస్తున్న బీజేపీ, ఎంఐఎం పటిష్టంగా ఉన్న నియోజకవర్గాలలో బీజేపీ బలాన్ని పెంచుకునే దిశగా వ్యూహాలు రచిస్తోంది.ఎంఐఎం ఎక్కడైతే పటిష్టంగా ఉన్న నియోజకవర్గాలలో ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న విషయం మనకు తెలిసిందే.

బీజేపీ హిందుత్వ పార్టీ అని దేశవ్యాప్తంగా బలంగా ముద్ర ఉన్నబీజేపీ పాతబస్తీ లాంటి నియోజకవర్గాలలో పార్టీని బలం పెంచుకోవాలని నిర్ణయించడం పెద్ద సాహసమే అని చెప్పాలి. ఎందుకంటే హిందుస్థాన్ అని పేరు పలకడానికే ఇష్టపడని వ్యక్తిత్వం కలిగిన ప్రజలు ఉన్న పరిస్థితులలో అక్కడ బీజేపీ సిద్దాంతాలను విస్తరించే ప్రయత్నం చేసినా ఉపయోగం ఉండదనే భావన రాజకీయ విశ్లేషకులలో వ్యక్తమవుతోంది.

అక్కడ ముస్లింలు తమకు ఉన్న సమస్యలపై బయటకు వచ్చి నిరసన తెలిపితే అప్పుడు వారికి బీజేపీ మద్దతు తెలిపితే అప్పుడు బీజేపీ పార్టీ వైపు ప్రజలు ఆలోచించి కొంత మేర సానుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది. కాని అటువంటి ఘటనలు ఇప్పటివరకు చోటు చేసుకోలేదు.ఎందుకంటే అక్కడి వారికి మద్దతు తెలపడానికి కూడా స్థానికంగా ఉన్న ఇతర పార్టీలు సైతం ధైర్యం చేసి బయటకు తీసుకొచ్చిన ఘటనలు లేవు. మరి పాతబస్తీలో పట్టుకోసం ప్రయత్నిస్తున్న బీజేపీ ఎంతవరకు సఫలీకృతం అవుతుందో మనం వేచి చూద్దాం.