ఆర్ఆర్ఆర్ నుండి ‘బ్లాస్టింగ్ బీట్స్’ అప్డేట్

రాజమౌళి ఆర్ఆర్ఆర్ కు సంబదించిన ప్రమోషన్స్ స్పీడ్ చేసారు. రీసెంట్ గా టీజర్ విడుదల చేసి ఆకట్టుకోకగా..తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ‘బ్లాస్టింగ్ బీట్స్.. హై వోల్టేజ్ డ్యాన్స్ నంబర్, నవంబర్ 10న’ అంటూ సెకండ్‌ సాంగ్‌కు సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్‌, రామచరణ్‌ స్టెపులేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ల డ్యాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ.. ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్‌లో డ్యాన్స్‌ చేసింది చూడాలంటే మాత్రం నవంబర్‌ 10వరకు ఆగాల్సిందే.

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్​ఆర్​ఆర్’​. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘ఆర్ఆర్ఆర్’ రూపొందిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ , కొమురం భీమ్‌గా ఎన్టీఆర్​ నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2022, జనవరి 7న విడుదల కానుంది. కీరవాణి సంగీతం అందిస్తుండగా..అజయ్ దేవగన్ , అలియా భట్ మొదలగు వారు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

RRR Second Single Poster: High Voltage Dance Number Naatu Naatu