శ్రామిక నగర్ పంచాయతీలో బ్లీచింగ్

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పొదలకూరు మండలంలోని శ్రామిక నగర్ గిరిజన కాలనీ నందు పంచాయతీ కాలువల్లో దోమల నివారణకు బ్లీచింగ్ కొట్టి పారిశుధ్యం నిర్వహించడం జరిగింది. వర్షాలు కారణంగా పంచాయతీ కాలువల్లో మురుగునీరు నిల్వ ఉండిపోయి చెత్త పేరుకుపోయి గత ప్రభుత్వంలో కాలవల్లో నీళ్లు బయటకు వెళ్లే దానికి మార్గాలు లేకుండా నిర్మించడం వల్ల వాటిల్లో దోమలు చేరి అంటు రోగాలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి. మంగళవారం కూటమిలో భాగంగా కుటమి నాయకులందరినీ కూడా కలుపుకొని ఆ గిరిజన కాలనీని సందర్శించి అక్కడ కాలవల్లో బ్లీచింగ్ కొట్టి పంచాయతీ అధికారులకి కాలువలు క్లీన్ చేయాలని చెప్పడం జరిగింది. అక్కడ పేద గిరిజనులు నివాసము ఉంటున్నారు వారికి ఎప్పుడు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కొంతమందికి తల్లికి వందనం రాలేదని చెప్పడంతో వారిని సచివాలయం కెళ్ళి అప్లై చేసుకునేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో కూడా గ్రామ పంచాయతీ పాలకులు పారిశుద్ధ్య పనులను నిర్వహించాలని తెలియజేస్తున్నము అలా నిర్వహించిన ఎడల సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టి తీసుకువెళ్లి చర్యలు చేపడతామని మనస్పూర్తిగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సందూరి శ్రీహరి, మణి, బిజెపి మండల సీనియర్ నాయకులు సిహెచ్ సుబ్రహ్మణ్యం సురేంద్రబాబు రవీంద్రబాబు వెంకటేశ్వర్లు ఓబులేసు గురుస్వామి పద్మనాభం జనార్ధన్ రెడ్డి శ్రీనివాసులు కృష్ణయ్య పొదలకూరు మండల అధ్యక్షుడు పూల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment