జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనను అడ్డుకోవడం హేయమైన చర్య

బనగానపల్లె, రాష్ట్ర ప్రభుత్వం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన అడ్డుకోవడం హేయమైన చర్య అని జనసేన పార్టీ నాయకులు భాస్కర్ అన్నారు. సోమవారం బనగానపల్లె పట్టణంలో విలేకరుల సమావేశంలో భాస్కర్ మాట్లాడుతూ శనివారం రాష్ట్ర మంత్రుల ఆధ్వర్యంలో నిర్వహించిన విశాఖ గర్జన సభ విఫలం అవ్వడంతో పవన్ కళ్యాణ్ ఆదివారం విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ప్రజల నుండి ప్రజా సమస్యలపై వినతిపత్రాలు స్వీకరిస్తున్నారని తెలిసి వారి అసమర్థ పాలన ఎక్కడ బయటపడుతుందో అని సభ జరగకుండా పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుండి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ జనసేన నాయకులపై కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారని జనవాణి కార్యక్రమం ప్రజల గొంతు అని ఆ ప్రజల గొంతు నొక్కడం ఎంతవరకు సమంజసమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వందల వినతులు స్వీకరించారని మిగతా పార్టీ నాయకులు ప్రజల నుండి వినతులు స్వీకరించకూడదా అని అన్నారు. అక్టోబర్ 1 నుండి సెక్షన్ 30 అమలులో ఉన్నాయి చెప్తున్నా పోలీసులు విశాఖలో రాష్ట్ర మంత్రులు విశాఖ గర్జనసభ ఎలా నిర్వహించారని వారికి రూల్స్ వర్తించవా అని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని ఎంతో హుందాగా ఎటువంటి వ్యక్తిగత విమర్శలు చేయకుండా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నాడని ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్నాడని అలాంటి సభను అడ్డుకోవడం వైసీపీ దుర్మార్గపు పాలనకు నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో కొలిమిగుండ్ల మండల నాయకులు పృధ్వి, అవుకు మండల నాయకుడు అజిత్ రెడ్డి, జనసైనికులు సురేంద్ర రాఘవ షేక్షావలి రామకోటి తదితరులు పాల్గొన్నారు.