వారహిపై వచ్చే జనసేనాని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలే: గంగారపు రామదాస్ చౌదరి

మదనపల్లె, బ్రిటిష్ కాలం నాటి జీవోలను‌ మళ్ళీ తెచ్చి సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాల అణిచివేతకు పాల్పడాలని చూడటం సమంజసం కాదని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి పేర్కొన్నారు. ‌గురువారం జనసేన పార్టీ కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, చేనేత విభాగం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి అడపా సురేంద్ర, ఐటి విభాగం జగదీష్, మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, గండికోట లోకేష్, జంగాల గౌతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జివో నంబర్ 1 ద్వారా ప్రభుత్వం పవన్ కళ్యాణ్ వారాహి బస్సు యాత్ర అడ్డు కోవాలని చూడటం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనం అన్నారు. ‌జనవరి 1 శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించే యువశక్తి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.