చీపురుపల్లిలో రక్తదాన శిబిరం

చీపురుపల్లి, మహిళా దినోత్సవం సందర్బంగా శనివారం జనసేన పార్టీ అద్వర్యంలో దత్తురాజేరు మండలంలో న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్ వారిచే జనసైనికుడు మిత్తిరెడ్డి తిరుపతి ఆధ్వర్యంలో స్వచ్చందంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి పడాల అరుణ పాల్గొనడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చెయ్యాలని యువతను కోరారు అలాగే మహిళలకు రక్షణగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన బ్లడ్ డోనర్స్ అందరకీ మెమోంటోస్ మరియు న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్ ఇచ్చిన సర్టిఫికెట్స్ డాక్టర్స్ మరియు అరుణ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు పడాల శరత్ దత్తిరాజేరు మండల అధ్యక్షులు చప్పా అప్పారావు గజపతినగరం మండల అధ్యక్షులు మునకాల జగన్ జిల్లా కార్య నిర్వహణ కమిటీ సభ్యులు మామిడి దుర్గాప్రసాద్ చీపురుపల్లి నియోజకవర్గ ఐటీ కో-ఆర్డినేటర్ అగురు వినోద్ కుమార్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు సింహాద్రి ప్రవీణ్, సింగారపు రామకృష్ణ, సారిక మురళి, చింత పైడితల్లి, సారిక మురళి, రామచంద్ర, సాయికిరణ్, సాయి, గణేష్, పోలినాయుడు, రవి, విజయ్ కుమార్, శంకర్, రాజేష్ మరియు సైనికులు తదితరులు పాల్గొన్నారు.