జనసేన ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధి భాదితుల కోసం రక్తదాన శిబిరం

మధిర నియోజకవర్గం: తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మరియు.. రాష్ట్ర నాయకులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ రామ్ తాళ్లూరి ఆదేశాల మేరకు.. తాళ్లూరి డేవిడ్ ఆధ్వర్యంలో.. తలసేమియా వ్యాధి భాదితుల కోసం రక్తదానం శిబిరం నిర్వహించగా.. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జనసేన పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మైలవరపు మణికంఠ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా తాళ్లూరి డేవిడ్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని.. పార్టీని గడప గడపకు తీసుకెళ్లేలా.. పార్టీ తరపున సేవా కార్యక్రమాలు చేస్తామని.. ప్రజా సమస్యల మీద ఎప్పుడు పోరాడతామని తెలియజేశారు. తలసేమియా సికిల్ సెల్ సొసైటీ సంస్థ వారు తాళ్లూరి డేవిడ్ ను దుశ్శాలువతో సత్కరించి.. రిమోట్ మొమెంటో అందజేయటం చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.