*గర్భిణీలకు, బాధితులకు ప్రాణవాయువు
సాలూరు, పాచిపెంట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మాతృభూమి సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగింది. సంఘ కార్యదర్శి ఇప్పలవలస గోపాలరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ఎన్విఎన్ విజయనగరం బ్లడ్ బ్యాంక్ సహకారంతో దాతల నుండి రక్త సేకరణ జరిగింది. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ, ‘‘గర్భిణీలు, తలసేమియా బాధితులు, ప్రమాదంలో గాయపడినవారికి రక్తదానం ఎంతో ప్రాణదాయకం. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి’’ అని పిలుపునిచ్చారు. తాసిల్దార్ డి. రవి మాట్లాడుతూ, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదాతలుగా ముందుకు రావాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ కట్టా జాన్సీ మాట్లాడుతూ, ‘‘రక్తదానం చేస్తే మనం ఎవరికైనా ప్రాణదాతలుగా మారుతాం’’ అన్నారు. రక్తదానం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలూ ఉండవని, అపోహలు పోగొట్టుకోవాలని కటారి ఈశ్వరరావు సూచించారు. ఈ శిబిరంలో 40 మంది దాతలు రక్తదానం చేయగా, కళాశాల విద్యార్థులకు రక్తదానంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించారు. ప్రజల్లో రక్తదానంపై అవగాహన పెంపొందించాలనే ఈ ప్రయత్నం సమాజానికి మంచి మార్గదర్శకంగా నిలుస్తోంది.
Share this content:
Post Comment