శ్రీకాకుళం, సాహుకారి అన్నపూర్ణమ్మ వర్థంతి సందర్భంగా ఆమె కుమారుడు సాహుకారి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్ భవనంలో రక్తదాన శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. ముందుగా అన్నపూర్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ సాహుకారి నాగేశ్వరరావు స్నేహశీలి అని, తన తల్లి జయంతి రోజున ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ తల్లిదండ్రుల పట్ల గౌరవభావంతో మెలగాలని సూచించారు. ఈరోజు అన్నదానం, పండ్లు పంపిణీ, ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు కళ్లద్దాలు పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, భవిష్యత్‌లో అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్టు ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ అన్వేష్, స్వాతి, పోలుమహంతి ఉమామహేశ్వరరావు, రాయితీ చంద్రశేఖర్, శాంతారావు, శ్రీనివాస్ పట్నాయిక్, నిక్కు అప్పన్న, బలివాడ మల్లేశ్వరరావు, పి.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు యువత రక్తదానం చేశారు. వారికి మెమెంటోలను, రెడ్‌క్రాస్ తరపున మెడల్స్‌ను బహుకరించారు. డాక్టర్ దానేటి శ్రీధర్ ను మొమెంటోతో పాటు దుశ్శాలువతో నాగేశ్వరరావు సన్మానించారు.
Share this content:
Post Comment