జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

పి పోలవరం జనసేన గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిది. ఈ కార్యక్రమాన్ని గ్రామ అధ్యక్షులు పి.రాంబాబు పర్యవేక్షించారు కార్యక్రమానికి ముఖ్య అధితిగా పాల్గొన్న పోడూరు మండల అధ్యక్షులు రావి హరీష్ బాబు మాట్లాడుతూ రక్తదాన శిబిరంలో ముఖ్య భూమిక పోషించిన జనసేన నాయకుడు వంశీ ని మరియు గ్రామ అధ్యక్ష కార్యవర్గాన్ని అభినందించారు. శిబిరంలో సుమారు 30 మంది రక్తదానం చేసారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వెంగళదాసు దానయ్య, జిల్లా కార్యదర్శి చిట్టూరి శ్రీనివాస్, పెనుగొండ మాజీ అధ్యక్షులు కంబాల, బాబులు, దార్లంకా మారుతీ పోడూరు మండల ప్రధాన కార్యదర్శి జగదీశ్ పోడూరు గ్రామ అధ్యక్షులు గణపతి, కవిటం గ్రామ అధ్యక్షులు సురేష్, వేమవరం గ్రామ అధ్యక్షులు శేఖర్, వల్లూరు గ్రామ అధ్యక్షులు ఉమా, వీరాస్వామి, దూది రాజు, మహేంద్ర, బాధతల ప్రవీణ్, మణికంఠ, మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment