Vijayanagaram: సామాజిక సేవతోనే ప్రజల్లో గుర్తింపు

విజయనగరం జిల్లా, కంటకాపల్లి గ్రామం, సేవా కార్యక్రమాలతోనే ప్రజల్లో గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు. మంచి పనులతో యువత సమాజానికి ఉపయోగపడాలని సూచించారు. జనసేన పార్టీ నాయకుడు తూరిబిల్లి విజయ్ కుమార్, జనసైనికుల సహకారంతో కంటకాపల్లిలో గ్రామ యువత ఆధ్వర్యంలో స్థానిక పాఠశాల వద్ద ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాధవ్ శిబిరాన్ని ప్రారంభించారు. భారతదేశ ఆత్మ గ్రామాల్లోనో ఉందని ఆయన పేర్కొన్నారు. అందుకే ఇక్కడే ముందుగా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పార్టీ నియోజకవర్గ నాయకులు వబ్బిన సత్తిబాబు, గొరపల్లి రవికుమార్, వబ్బిన సన్యాసినాయుడు, పెదిరెడ్ల రాజశేఖర్ నిర్వహకులను అభినందించారు. మంచి కార్యక్రమాలకు జనసేన మద్ధతు కచ్చితంగా ఉంటుందన్నారు. ఇకపై జనసేన తరపున నియోజకవర్గ వ్యాప్తంగా మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ సి.ఆర్.కె.ప్రసాద్ శిబిరాన్ని సందర్శించి రక్తదాతలను అభినందించారు. అన్ని గ్రామాల్లోనూ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించి యువతను సంఘటిత పరచాలని కోరారు. ఇటీవల స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీగా పోటీచేసి యువతకు ఆదర్శంగా నిలిచిన తూరిబిల్లి విజయ్ కుమార్ ను రిటైర్డ్ తహశీల్దార్ పిల్లా అర్జున్ శాలువాతో సత్కరించారు. మొత్తం 30 మంది యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో జనసేన పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మల్లువలస శ్రీను, దేశపాత్రునిపాలెం పంచాయతీ వార్డ్ మెంబర్ గొరపల్లి పోలినాయుడు, నాయకులు నక్కరాజు సతీష్, గురజాడ వెంకటేష్, ఎస్.సునీల్ కుమార్, ఎ.సురేష్, ఎస్.సుమంత్, గుమ్మడి వెంకటరావు, గొర్లె శ్రీను, జె.భాస్కరరావు, టి.అప్పలరాజు, నిర్వహకులు ఎస్.గణేష్ పాల్గొన్నారు.