రక్తదానం – ప్రాణదానంతో సమానం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా జనసేన కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం

గూడూరు, రక్తదానం ప్రాణదానంతో సమానమని జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నెల్లూరుజిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు అన్నారు. ఈనెల 27 న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత పిలుపు మేరకు మెగాబ్రదర్స్ సేవాసమితి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సహకారంతో గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సినీ హీరోల అభిమానులను సేవా కార్యక్రమాల వైపు మళ్లించిన ఘనత పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవిదేనని, రక్తదానం వల్ల ప్రమాదాల్లో గాయపడ్డ వారిని, అత్యవసర సమయాల్లో క్షతగాత్రుల ప్రాణాలను కాపాడగలిగిన వారిమి అవుతామని, రక్తదానం – ప్రాణదానంతో సమానమని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత కలిగి రక్తదానం చేయాలని కోరారు. ప్రతి ఏడాది మెగా హీరోల జన్మదినాలను పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలతో పాటుగా రక్తదాన శిబిరాలు నిర్వహించి ప్రాణాలను నిలబెడుతున్న రక్తదాతలను, మెగా అభిమానులను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో పి.ఓ.సి కె.మోహన్, సాయి, రాకేష్, ఓంకార్, ఇమ్రాన్, సనత్, షఫీ,నవీన్, ముత్యాలు, భాస్కర్, కార్తిక్, రవి, మహేశ్, సునీల్, గురు, అను, చరణ్, మధు, శివాజీ, తిరుపాలు, మహేష్,మనోజ్, మస్తాన్, శ్రీను, వినయ్, శంకర్ మెగా ఫ్యామిలీ అభిమానులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment