జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన కార్యక్రమం

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 14న జరగబోయే వేడుకలలో భాగంగా హైదరాబాద్‌లోని ఆర్ టి సి క్రాస్ రోడ్స్ వద్ద పవన్ కళ్యాణ్ ఫాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ పాల్గొని రక్తదాతలకు హెల్త్ డ్రింక్ అందించి, ప్రతి రక్తదాతను అభినందించారు. కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు దామోదర్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి సైదల శ్రీనివాస్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రక్తదానం కార్యక్రమం ప్రజాసేవకు అంకితమై ఉన్న జనసేన పార్టీ ఆదర్శాలను ప్రతిబింబించిందని, భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపడతామని నాయకులు తెలిపారు.

WhatsApp-Image-2025-03-10-at-8.01.51-PM-1-1024x621 జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన కార్యక్రమం

Share this content:

Post Comment