విద్యార్థులకు మజ్జిగ పంపిణీ చేసిన బొబ్బేపల్లి

సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గం లోని ముత్తుకూరు మండలంలో మజ్జిగ పంపిణీ చేసారు. బుధవారం హిందీ పరీక్ష రాసిన విద్యార్థిని విద్యార్థులందరికీ వేసవి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల ఎగ్జామ్ రాసి బయటకు వచ్చే పిల్లలకి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా కుటమీ ప్రభుత్వం చదువుకునే పిల్లలందరికీ కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించడంలో వెన్నంటి ఉంటుంది. పదవ తరగతి అనేది మొదటి మెట్టు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా పరీక్షలు రాయండి మంచి మార్కులను సాధించండి రాబోయే రోజుల్లో నియోజకవర్గానికి మంచి పేరు తీసుకు వస్తారని జిల్లాకి రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకు వస్తారని మనస్పూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి పదవ తరగతి పరీక్షల రాసే ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సకాలంలో స్కూల్ కి పరీక్ష సమయానికి చేరుకోండి. ఎక్కడ కూడా టెన్షన్ పడవద్దు అదేవిధంగా పిల్లలు ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరు అయినా చెయ్యెత్తి లిఫ్ట్ అడిగితే ఆపి లిఫ్ట్ ఇవ్వమని మనస్పూర్తిగా కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవాని నాయుడు ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, సందూరి శ్రీహరి, ఆంజనేయులు, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment