చిన్న చెరుకూరు హైస్కూల్ నందు సుగంధ వాటర్ పంపిణీ చేసిన బొబ్బేపల్లి

సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అధ్యక్షతన మండల అధ్యక్షుడు అంకెం సందీప్ రాయల్ ఆధ్వర్యంలో పిల్లలకే సుగంధ వాటర్ పంపిణీ చేసారు. పదవ తరగతి ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు వేసవి కారణంగా చిన్న చెరుకూరు నందు హైస్కూల్ ప్రాంగణంలో సుగంధ వాటర్ పంపిణీ చేయడంతో పాటు కూతమి ప్రభుత్వం విద్యార్థిని విద్యార్థులకు అండగా ఉంటుంది, అదేవిధంగా వాళ్లకి ఎటువంటి ఇబ్బందులు వచ్చిన మేమంతా అండగా ఉంటామని చెప్పడంతో పాటు నియోజకవర్గంలో దాదాపుగా అన్ని పాఠశాలలో ప్రాంగణాల్లో మజ్జిగ మంచినీళ్లు ఇలాంటి చలివేంద్రాలు కూడా కూటమి ప్రభుత్వం అభ్యర్థులు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమినేని వాణి భవాని నాయుడు, సందూరి శ్రీహరి, మండల కార్యదర్శి పుట్టా రాకేష్, అంకేం నాగేశ్వరరావు, రావుల సాయి, ఉల్లం పవన్, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment