గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన బొబ్బేపల్లి

సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో గిరిజన కాలనీ నందు కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడు సేవాభావములో బాబాయితో సరితూగే వ్యక్తి ఆటు సినీ రంగం మరియు సేవారంగంలోనూ పెద్దలను గౌరవించడంలో ఆయన ఒక శిఖరం, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా సినీ రంగంలో తనదైన శైలిలో అనేక పాత్రలను పోషిస్తూ గొప్ప పేరు ప్రతిష్టను సంపాదించుకోవడంతో పాటు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండాలని సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి మనస్పూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండలం సీనియర్ నాయకుల రహీం, బోలా అశోక్, దగోలు సుమన్, మస్తాన్, దినేష్, శ్రీకాంత్, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment