సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలాన్ని గ్రామ స్థాయిలో విస్తరించేందుకు జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు చురుకుగా ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా తోటపల్లి గూడూరు మండలం తోటపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో యువతను కలిసిన ఆయన, పవన్ కళ్యాణ్ నాయకత్వం పట్ల నమ్మకంతో ఉన్న వారితో వారి ఇంటికే వెళ్లి మాట్లాడారు. వారి అభిప్రాయాలను తెలుసుకొని, పార్టీ బలోపేతానికి వార్డు స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రామాభివృద్ధి, సమస్యల పరిష్కారం, రాజకీయ చైతన్యం గురించి వారికి అవగాహన కల్పించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రతి ఒక్కరికీ చేరేలా కార్యక్రమాలు చేపడతామనీ, యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవాని నాయుడు, సందూరి శ్రీహరి, స్థానిక నాయకులు మనోహర్, తోట రాముడు, నరేంద్ర, రవి ప్రసాద్, వెంకయ్య నరసింహ, సూర్యప్రకాశ్, పవన్, దయాకర్, పోలయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment