అకాల వర్షానికి తడిచిన ధాన్యాన్ని పరిశీలించిన బొబ్బేపల్లి సురేష్

వెంకటాచల మండలం, తిరుమలమ్మ పాలెం: నిన్న అర్థరాత్రి ఉరుములతో కూడిన గాలి వాన సర్వేపల్లి నియోజకవర్గంలోని పలుచోట్ల రైతులకు గట్టి నష్టాన్ని కలిగించింది. కోత కోసి ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షానికి తడవడం వల్ల రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని చూసిన జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు తక్షణమే తిరుమలమ్మ పాలెం గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వము కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి, అలాగే పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తరఫున రైతులకు అండగా ఉండే విధంగా సహాయం చేయాలని ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో జనసేన నాయకులు పినిశెట్టి మహేష్, మండల కార్యదర్శి సంధురూ శ్రీహరి, మండల నాయకులు చల్లా చెంచయ్య, మణి తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment