సర్వేపల్లి, జంగాలపల్లి గిరిజన కాలనీ నందు జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆదివారం పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసిపి పాలనలో అభివృద్ధి లేదు అప్పులు మిగిల్చారు నేడు మీడియా సమావేశాలు పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న మాజీమంత్రి కాకాణి మీరు పొడిచింది ఏం లేదు. ఇదిమేపల్లి పంచాయతీ పరిధిలోని జంగాలపల్లికి ఆనుకొని ఉన్న గిరిజన కాలనీలో గిరిజనుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకోవడం ప్రధానమైన సమస్యలని పరిష్కరించే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇటీవల కూడా బోర్లు రిపేర్ అయితే కూటమి ప్రభుత్వం నుంచి మేము దగ్గరుండి చేపించడం జరిగింది. దీంతోపాటు ప్రధానమైనది స్మశానానికి వెళ్లే దారి ఆక్రమణకు గురవుతుంది రోడ్డు కావాలని చెప్పి అడగడం జరిగింది దాంతోపాటు తాగునీటికి సంబంధించి అదేవిధంగా ఇల్లు లేని గిరిజనులకి నూతనంగా ఇల్లు కేటాయించడం పెన్షన్ లేని ఆధార్ కార్డు లేని రేషన్ కార్డు లేని గిరిజనులను గుర్తించి వాళ్ళందరికీ కూడా సకాలంలో ఇవన్నీ కూడా అందించే విధంగా మేము అడుగులు ముందుకు వేస్తున్నాం దీంతోపాటు సర్వేపల్లి నియోజకవర్గంలో అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు ఎవరికైనా సరే ఇబ్బందులు ఉన్నాయి మా సమస్యలు పరిష్కరించండి అని అంటే ఆ సమస్యలను పరిష్కరించడంలో మేము ఎప్పుడూ కూడా కూటమి తరఫున ప్రజా శ్రేయస్సు కోసం పేద బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగులు నింపడం కోసం వారి వెంట ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవాని నాయుడు పినిశెట్టి మల్లికార్జున్, మండల కార్యదర్శి సందూరి శ్రీహరి, మణి, స్థానికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment