గిరిజన కాలనీలో పర్యటించిన బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం గ్రామం గిరిజన కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అట్టడుగున ఉన్న పేద గిరిజనులు ఇప్పటికీ కనీస వసతులు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నట్లు తెలిపారు. గత ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమించినప్పటికీ గిరిజనులకు న్యాయం జరిగిన దాఖలా లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం గిరిజనులకు అండగా ఉంటుందని, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పెన్షన్, గృహ వసతి వంటి ప్రాథమిక సదుపాయాలను గిరిజనులకు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గిరిజన కాలనీల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, సందూరి శ్రీహరి, చిన్న, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-03-11-at-5.45.20-PM-1024x576 గిరిజన కాలనీలో పర్యటించిన బొబ్బేపల్లి సురేష్

Share this content:

Post Comment