రాజోలు గిరిజన కాలనీలో బొబ్బేపల్లి పర్యటన

సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం, రాజోలుపాడు గిరిజన కాలనీ నందు శుక్రవారం పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. పర్యటనలో భాగంగా కొందరు తల్లికి వందనం పడలేదని పేరు కూడా లిస్టులో లేదని స్థానిక గిరిజనులు తెలియజేయడం జరిగింది. వెంటనే సచివాలయం సిబ్బందితో మాట్లాడి వాళ్లకి రేషన్ కార్డు నమోదు చేయించి వెంటనే తల్లికి వందనానికి సంబంధించిన అప్లికేషన్ ఫిలప్ చేసి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు స్థానికంగా పంచాయతీ కాలువలో ప్లాస్టిక్ కవర్లు పేరుకుపోయి మురుగు కాలవలో నిల్వ ఉండిపోయి దోమలతో దుర్వాసనతో అల్లాడిపోతున్నారని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపై మండలాధికారులకి తెలియజేసి త్వరగా కాలువలు క్లీన్ చేసే ప్రక్రియను చేపడతామని హామీ ఇవ్వడంతో పాటు వాళ్లకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేకపోతే త్వరగా నమోదు చేసు కోవాలని చెప్పడంతోపాటు తల్లికి వందనం అనేది అర్హులైన పేద చదువుకోవాలని కోరిక ఉన్న బిడ్డలకి ఇంధనం లాంటిది కాబట్టి ఖచ్చితంగా కూటమి స్థానిక పంచాయతీలో ఉన్న నాయకులందరూ కూడా అర్హులైన పేద బిడ్డలకి తల్లికి వందనం వచ్చిందా రాలేదు కనుక్కొని వారికి అప్లై చేయించి అందేలాగా చూడాలని మనస్ఫూర్తిగా కోరారు. ఈ కార్యక్రమంలో సందూరి శ్రీహరి, మనుబోలు మండల నాయకులు ఆనంద్ బాబు శరత్ బాబు, సుధీర్, యస్వంత్, సునీల్, నరసింహులు, కంటే సుధాకర్, బెజవాడ భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment