ఈదగాలి పంచాయతీలోని శ్రీకాంత్ కాలనీ నందు పర్యటించిన బొబ్బేపల్లి

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు గురువారం సర్వేపల్లి నియోజకవర్గంలోని ఈదగాలీ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి శ్రీకాంత్ కాలనీ నందు పర్యటించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీకాంత్ గిరిజన కాలనీలో గిరిజనులకు సంబంధించి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఉన్నాయా లేవా అనేటువంటి విషయాన్ని కనుక్కోవడం కోసం రావడం జరిగింది. అందులో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులు ప్రధాన సమస్యలను రెండు సమస్యలను మా దృష్టికి తీసుకురావడం జరిగింది అది ఒకటి ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకునేటువంటి ఎలిమెంటరీ స్కూలు భవనం పెచ్చులు ఊడిపోవడం జరుగుతుంది దానికి సంబంధించి ఇంజనీర్ ద్వారా పరిశీలించి కొత్త భవనం కట్టించడమా లేదంటే ఈ భవనాన్ని మరమతలు చేయడం అనే విషయాన్ని తెలియజేశారు దీంతో పాటు అంగన్వాడి భవనం శిథిలావస్థలో ఉంది ప్రస్తుతం రెంట్ భవనంలో కొనసాగిస్తున్నారు కాబట్టి అంగన్వాడి స్కూల్ కూడా నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రెండు విషయాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కూటమిలో భాగంగా గిరిజనుల యొక్క ప్రధాన సమస్యలలో విద్య అనేది చాలా ప్రధానమైనది కాబట్టి ఈ రెండు విషయాలను కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లి ఈ రెండు భవనాలు నిర్మాణం కోసం మా వంతు మీ కృషి చేస్తామని చెప్పి వాళ్లకి హామీ ఇచ్చాం. ఇదేవిధంగా గిరిజన కాలనీలో గిరిజనుల యొక్క సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే మారుమూల ఉన్న గిరిజనుల యొక్క సమస్యలను పరిష్కరిస్తున్నారో అదే విధంగా మేము కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో గిరిజన కాలనీలు తిరిగి అక్కడ ప్రజల యొక్క సమస్యలను ఒక్కొక్కటి ఒక్కటి పరిష్కరించుకుంటూ ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమినేని వాణి భవాని నాయుడు పినిశెట్టి మహేష్, మండల కార్యదర్శి సందూరి శ్రీహరి, మణి మరియు స్థానిక గిరిజన నాయకులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment