సర్వేపల్లి నియోజకవర్గం, జనసేన పార్టీ పిఓసి బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని పదులపురం మండలంలో కనపర్తికి వెళ్లే రోడ్డుని పరిశీలించడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు రెండుసార్లు ఓట్లేసి గెలిపించిన మాజీ శాసనసభ్యులు మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సొంత మండలం అని చెప్పుకునే పొదలకూరు మండలం. ఈ మండలంలో ప్రజలు రెండు సార్లు మెజార్టీ ఓట్లేసి గెలిపిస్తే ఇదే మండలంలో కనీసం రోడ్లు అస్తవ్యస్తంగా ఉంటే పట్టించుకున్న పాపాన పోలేదు, ఇదే పొదలకూరు మండలంలో కోట్ల రూపాయలు విలువ చేసే తిప్పలను మింగేశాడు, మైనింగ్ ని మింగేసాడు కోట్ల రూపాయలు దోచుకున్నాడు. నేడు కూటమిలో భాగంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి 5 కిలోమీటర్లు రోడ్డుని నిర్మాణం చేసేలా మా వంతు కృషి చేస్తాం అని చెప్పి గ్రామస్తులకి మాట ఇవ్వడం జరిగింది. కుటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుంది, ఇది మంచి ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవాని నాయుడు సందూరి శ్రీహరి, నారదాసు రవి, మనోజ్, ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు జమీర్, పులపుతూరు రామ్ గోపాల్, మహేంద్ర, శివకృష్ణ, మురళి, మనోజ్, మదన్, వాసు, చైతన్య, గోపాల్, మధు, మహేష్, మాల్యాద్రి, శ్రీధర్, అశోక్, రవయ్య తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment