వారాహి యాత్ర 4వ దశ పోస్టర్ని ఆవిష్కరించిన బొబ్బేపల్లి సురేష్

  • వారాహి విజయ యాత్ర 4వ విడత అక్టోబర్ 1న ప్రారంభం
  • జనసేన వారాహి విజయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది

సర్వేపల్లి: వెంకటాచల మండల కేంద్రంలోనీ సర్వేపల్లి జనసేన పార్టీ కార్యాలయం నందు శనివారం వారాహి విజయ యాత్ర నాలుగవ దశ పోస్టర్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో భాగంగా మొదటి విడత జూన్ 16 అన్నవరం నుండి ప్రారంభమై ఎంతో విజయవంతంగా 9 నియోజకవర్గాల్లో పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత రెండో విడత వెస్ట్ గోదావరి జిల్లాలోని మూడు నియోజకవర్గాలు, ఉమ్మడి విశాఖలోని మూడోవ విడత ఆరు నియోజకవర్గాల్లో వారాహి విజయ యాత్ర విజయవంతంగా కొనసాగడంతో ప్రజల్లో జనసేన పార్టీకి ఆదరణ పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన కోట్ల రూపాయల అవినీతిని ప్రజలకి పూర్తిగా అర్థమయ్యే విధంగా మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మాటలు తూటాల్లాగా పేల్చడంతో ఈ వైసిపి మంత్రులకు, ఎమ్మెల్యేలకి గుండెల్లో గుబులు పట్టుకుంది. నాలుగోవ విడత నాలుగు నియోజకవర్గాల్లో జనసేన విజయ యాత్ర కొనసాగలనుంది. మార్పు కోసం జనసేన పార్టీని, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయ యాత్ర కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో మార్పు కోసం జనసేన పార్టీ అనేక విధాలుగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే విధంగా పని చేస్తుంది.
2024లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడానికి జనసేన పార్టీ విజయకేతనం ఎగరవేయడం కోసం ముందుకు వెళుతుంది. ప్రజల్లో కూడా ఒక గొప్ప ఆలోచన వచ్చి ఒక అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు కల్పించకూడదు అనేటువంటి చర్చలు మొదలయ్యాయి. మార్పు వచ్చిందన్నడానికి ఇంతకంటే ఇంకా ఉంది. వైసీపీ నాయకులు చేసిన అవినీతిని బట్టబయలు చేయగలిగినటువంటి ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విధాలుగా మా జనసైనికులని, నాయకులని, కార్యకర్తలని, మా అధినేత పై అవాకులు చవాకులు పేలిన అడ్డు పడాలని చూసిన జనసేన పోరాటం ఆగదు. జనసేన వారాహి విజయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది.
ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్, చిరంజీవి యువత నియోజకవర్గ అధ్యక్షులు ఖాజా రహమతుల్లా, పవన్ కళ్యాణ్ యువత నియోజకవర్గ అధ్యక్షులు అశోక్, ఉపాధ్యక్షుడు సుమన్, మండల కార్యదర్శి దయాకర్, శ్రీహరి, వంశీ తదితరులు పాల్గొన్నారు.