జనసేన పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్ ఆవిష్కరించిన బొబ్బేపల్లి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టీడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 నుంచి పలు పెరగని పోరాటం చేసి ఎన్నో అవమానాలు ఎన్నో కేసులు ఎన్నో పోరాటాలు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఒక దశాబ్ద కాలం పాటు ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా దినదినాభివృద్ధి చెందుతూ నేడు 2014లో కూటమిలో కీలక పాత్ర పోషించి 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కని, విని ఎరగని రీతిలో వందకి 100% విజయం సాధించిన పార్టీగా జనసేన పార్టీ రూపాంతరం చెందడం, గాజు గ్లాసును శాశ్వతమైన ఎన్నికల గుర్తుగా ఎన్నికల సంఘం కేటాయించడం, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి విజయోత్సవ ఉత్సవం సందర్భంగా ఈ నెల 14వ తారీకు పిఠాపురంలో జరగబోయే ఈ మహోత్సవంలో ప్రజలందరూ కూడా భాగస్వాములై జనసేన పార్టీకి అండగా నిలబడే విధంగా ఈ సభని విజయవంతం చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటూ ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క పోస్టర్ని ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, బొల్లా, అశోక్, సందూరి శ్రీహరి, ఎలికం గిరీష్ అఖిలేష్ గౌడ్, పెడకాల కిషోర్, కావలి మస్తాన్, రహమాన్, తేజ, వెంకీ, సెల్లు, అశోక్, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment