రోడ్లను బాగుచేయాలని డిమాండ్ చేసిన బొబ్బిలి జనసేన

బొబ్బిలి నియోజకవర్గం, గొర్లె సీతారాంపురం వద్ద రాష్ట్రీయ రహదారిపై ఏర్పడిన గోతులను పూడ్చి రోడ్లను బాగుచేయ్యాలని జనసేన నాయకులు మహంతి ధనంజయ, బంటుపల్లి దివ్య, శ్రీను, సురేష్, స్వాతి మరియు పారది జనసైనికులు మరియు వీరమహిళలు నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా రోడ్లు పాడైపోయి ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం అన్యాయం అన్నారు. తక్షణమే రోడ్లు బాగుచేయాలని లేదంటే పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.