వైసీపీకి దీటుగా సమాధానం ఇచ్చిన బొబ్బిలి జనసేన

బొబ్బిలి నియోజకవర్గం: జనసైనికుల నిలయంలో పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై వ్యాఖ్యలు చేశారని, మరేదో దుష్ప్రషారంగా మాట్లాడుతున్నారని అధికార వైసీపీ నేతలు వాలంటీర్లను రెచ్చ కొట్టి పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలు తగలబెట్టించి, చెప్పులు దాంట్లో వేయడం జరిగింది. దీనికి దీటుగా బుధవారం బొబ్బిలి జనసైనికుల నిలయంలో వాలంటీర్లకు మరియు వైసీపీ నేతలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరి, బొబ్బిలి నాయకులు మరియు బొబ్బిలి నాలుగు మండలాల అధ్యక్షులు కలిపి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ కు పూలమాలలతో, పాలాభిషేకం చేసి పవన్ రావాలి పాలన మారాలి అని చెప్పి నినాదాలతో పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం ప్రెస్ మీట్ లో బాబు పాలూరి మాట్లాడుతూ.. వైసీపీని దుమ్మెత్తి పోశారు. 5000 జీతంతో యువతలోని ప్రతిభను వారిలోని శక్తిని ఐదు వేలకే అలా కట్టిపడేస్తుందని ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలని చెప్పేసి వాలంటరీల కోరుకుంటున్నారని, కానీ వారిలో ఉన్న కొంతమంది చెడ్డవారిని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు అని చెప్పి, ఈ రౌడీ వైసిపి నాయకులు కొంతమంది వాలంటీర్ల గుంపులో చేరిపోయి చేరిపోయి తూతూ మంత్రంగా మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అసలు చెప్పాలంటే వాలంటీర్లను పవన్ కళ్యాణ్ గారు ఏమని విమర్శించార్నేది కూడా తెలియని పరిస్థితి నెలకొంది అనే దుమ్మెత్తి పోశారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి నియోజకవర్గ మండల అధ్యక్షులు గంగాధర్, బవిరెడ్డి మహేష్, మరడాన రవి మరియు నాయకులు సాయి సురేష్, రామక్రిష్ణ, ఉమా మహేష్, ధనుంజయ, ఆదినారాయణ, పల్లెం రాజా, వెంకటరమణ, చీమల సతీష్, వీరమహిళలు దివ్య, యామిని వైసీపీకి దీటుగా సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి నియోజకవర్గం నాయకులు, జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.